యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గి పోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా యాదాద్రిలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 11.6 నుంచి 13.2 డిగ్రీలు నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా సగటున యాదాద్రిలో 13.9 నమోదు కాగా, నల్గొండలో 15.3, సూర్యాపేటలో 15.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్నాయి. రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ రిపోర్ట్ చేసింది
