ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్టను మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీగా మారుస్తాం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట మున్సిపాలిటీని మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీగా మారుస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. మున్సిపాలిటీ అభివృ-ద్ధికి సంబంధించిన ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారంలోపు అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనర్సింహస్వామి ఆలయం నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన 30 శాతం గ్రాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా వారంలోపు చెల్లిస్తామని వైటీడీఏ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు హామీ ఇచ్చారన్నారు. గుట్టలో ప్రతి ఇంటికి డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లు కేటాయిస్తామని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి రాజకీయాలకతీతంగా సహకరించాలని కోరారు. గుట్టలో ఐదు ఎకరాల్లో, మూడు అంతస్తుల్లో 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించనున్నట్లు తెలిపారు. వారంలోపు టెండర్లు పూర్తి చేసి ఆగస్టు లోపు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎరుకలసుధ హేమేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, గుండ్లపల్లి వాణి భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం ఆలేరులో దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు.

ఓటమి భయంతోనే బీజేపీ లీడర్లపై కేసులు

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేక, ఓటమి భయంతోనే అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన వీడియోను వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజమణిపై కేసు పెట్టడం సరికాదన్నారు. వీడియో చేసిన వ్యక్తులపై కాకుండా ఫార్వార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యక్తులపై కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. అంతకుముందు యాదగిరిగుట్ట పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి బీజేపీ లీడర్లపై కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పట్టణ అధ్యక్షుడు  భువనగిరి శ్యాంసుందర్, నాయకులు రచ్చ శ్రీనివాస్ ఉన్నారు.

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి అభివృద్ధికి రూ. 22 కోట్లు

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : నల్గొండ జిల్లా నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పట్టణ అభివృద్ధికి రూ. 22 కోట్లు మంజూరు అయ్యాయని నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. శుక్రవారం స్థానికంగా మాట్లాడుతూ ఈ నిధులతో పట్టణంలో డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైటింగ్, డివైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు వంటి పనులు చేయనున్నట్లు చెప్పారు. ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సహకరించిన మంత్రులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుతో నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రూపురేఖలు మారనున్నాయన్నారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

రూ. 105 కోట్లతో నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి

నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో రూ. 105 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. పట్టణంలో మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిప్పర్తి, మూసీ రోడ్ల విస్తరణ, సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు చెప్పారు. ప్రస్తుతం నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు విస్తరణ పనులు, 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెజ్, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. మండల, పట్టణ అధ్యక్షుడు నవీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, యాదగిరి, నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

సంక్షేమం పేరిట అప్పుల రాష్ట్రంగా మార్చిన్రు

మిర్యాలగూడ, వెలుగు : మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న తెలంగాణను సంక్షేమం, అభివృద్ధి పేరిట సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పుల రాష్ట్రంగా మార్చారని టీడీపీ నల్గొండ పార్లమెంటరీ అధ్యక్షుడు నెల్లూరి దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో మొల్కపట్నంలో నిర్మించిన డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లను శుక్రవారం ఆయన పరిశీలించి ఆట్లాడారు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పంపిణీ చేయకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ, మంత్రులు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారం చేపట్టిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీలను తుంగలో తొక్కిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసుల సత్యం, పార్లమెంటరీ సహాయ కార్యదర్శి జడ రాములుయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మైనార్టీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు జానీమియా, మండల అధ్యక్షుడు షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రసూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జయ, రామాచారి పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే సునీత ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రూ. వేల కోట్ల సంపాదించుకున్నారని టీపీసీసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీర్ల అయిలయ్య ఆరోపించారు. యాదాద్రి జిల్లా ఆలేరులో శుక్రవారం నిర్వహించిన వడ్డెర సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలను గాలికొదిలేసి, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు మళ్లీ ప్రజలను నమ్మించేందుకు కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టిస్తానని చెబుతున్నారన్నారు. యాదగిరిగుట్టలో వడ్డెరలకు జీవనాధారమైన గుట్టను వైటీడీఏకు అప్పగించి, వడ్డెరల ఉపాధిపై దెబ్బ కొట్టారన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు నీలం పద్మ, వెంకటస్వామి, జైనొద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

అనంతలక్ష్మికి  నివాళులర్పించిన గుత్తా

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ మున్సిపాలిటీ టీడీపీ మాజీ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారగోని అనంతలక్ష్మి గత నెల 28న బెంగళూరులో చనిపోయారు. ఆమె మృతదేహాన్ని గురువారం నల్గొండకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి శుక్రవారం అనంతలక్ష్మి మృతదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారివెంట మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్బగోని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు దుబ్బ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐతగోని స్వామి, వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తదితరలు  పాల్గొన్నారు.