యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. 49 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా.. మొత్తం రూ.3,52,47,662 ఆదాయం వచ్చింది. అలాగే 114 గ్రాముల బంగారం, 3.900 కిలోల వెండి వచ్చినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు.
అలాగే 2,047 అమెరికా డాలర్లు, 85 కెనడా డాలర్లు, నేపాల్ కు చెందిన 180, వియత్నాంకు చెందిన 1000, న్యూజిలాండ్ 5, ఇంగ్లాండ్ 190 పౌండ్స్ వచ్చాయి. దిరామ్స్ 565, ఆస్ట్రేలియా 110, మలేషియా 53, సింగపూర్ 16, సౌదీ అరేబియా 116, యూరో 30, సౌతాఫ్రికా 100, కెన్యా 100, ఖతార్ కు చెందిన 2 కరెన్సీ వచ్చినట్లు ఈవో వెల్లడించారు. గురువారం పలు రకాల పూజలతో రూ.16,34,702 ఆదాయం వచ్చింది.
