నారసింహుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు

నారసింహుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు

నారసింహుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లను గురువారం ఆలయ సిబ్బంది లెక్కించారు. 21 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్​లో లెక్క పెట్టారు. ఇందులో రూ.2,05,55,422 నగదు రాగా.. 45 గ్రాముల బంగారం, 3 కిలోల 100 గ్రాముల వెండి వచ్చింది. అలాగే 628 అమెరికా డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్, 100 ఆస్ట్రేలియన్​డాలర్లు, 20 కెనడా డాలర్లు, 40 న్యూజిలాండ్ డాలర్లతో పాటు ఇతర విదేశాల కరెన్సీ వచ్చిందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు.

లెక్కింపును ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు. మరోవైపు ఆలయంలో నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా గురువారం ఆలయానికి రూ.23,39,914 ఆదాయం సమకూరింది.