యాదగిరిగుట్టకు భారీగా ఆదాయం

యాదగిరిగుట్టకు భారీగా ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం ఆలయ సిబ్బంది కౌంట్ చేశారు. 30 రోజులుగా హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి లెక్కించారు. హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు తరలించి కౌంట్ చేశారు. ఇందులో రూ.2,55,83,999 నగదు రాగా.. 91 గ్రాముల బంగారం, 4 కిలోల 650 గ్రాముల వెండి సమకూరింది. అలాగే 1343 యూఎస్ ​డాలర్లు, 95 యూఏఈ దిర్హామ్స్, 55 ఆస్ట్రేలియన్ ​డాలర్లు, 140 కెనడియన్​డాలర్లు, 10 ​రింగిట్స్ (మలేషియన్​ కరెన్సీ), 200 బైసా (ఒమన్ కరెన్సీ)​, 21 ​నెగటరమ్ (భూటాన్), 12 ​రియాల్స్ (ఖతార్), 8 సింగపూర్ ​డాలర్లు, 25 పౌండ్లు, 60 యూరోస్​ వచ్చినట్లు ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి తెలిపారు. 

 శ్రీశైల మల్లన్న ఆదాయం 2కోట్ల87లక్షలు 

శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల హుండీని గురువారం లెక్కించారు. శివరాత్రి అయ్యాక 22 రోజుల హుండీలను లెక్కించగా రూ.2 కోట్ల87 లక్షల1,092 నగదు వచ్చిందని ఈఓ లవన్న తెలిపారు. అలాగే 162 గ్రాముల బంగారం, 7 కిలోల 110 గ్రాముల వెండి వచ్చిందన్నారు.  వీటితో వివిధ దేశాల కరెన్సీ భక్తులు సమర్పించారన్నారు.