యాదగిరిగుట్టలో 'కియోస్క్' సేవలు స్టార్ట్ : చైర్మన్ నరసింహమూర్తి

యాదగిరిగుట్టలో 'కియోస్క్' సేవలు స్టార్ట్ : చైర్మన్ నరసింహమూర్తి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 'కియోస్క్' యంత్రాల సేవలు సోమవారం నుంచి అందు బాటులోకి వచ్చాయి. ఈ సేవలను సోమవారం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో వెంకటరావు ప్రారంభించారు. రూ.10 లక్షలు విలువ చేసే ఆరు కియోస్క్ యంత్రాలను ఆలయానికి కెనరా బ్యాంక్ విరాళంగా ఇచ్చింది. 

అఖండ జ్యోతి ప్రాంగణంలో మూడు యూనిట్లు, అద్దె గదులు, డోనర్ సెల్, వ్రత మండపంలో ఒక్కో యూనిట్ చొప్పున కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటరావు మాట్లాడుతూ.. కియోస్క్ యంత్రాల వినియోగం వల్ల భక్తులు దర్శన టికెట్లు, వ్రత టికెట్లు, ప్రసాదం టికెట్లతో పాటు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల పూజలు, కైంకర్యాలకు సంబంధించిన టికెట్లను డిజిటల్ పేమెంట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. కియోస్క్ యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆలయ సేవల్లో ఆధునీకరణదిశగా తొలి అడుగు పడిందన్నారు. ఆలయ సేవలను పూర్తిగా ఆధునీకరిస్తామని తెలిపారు.

'యాదగిరి' మాసపత్రిక ఆఫీస్ ప్రారంభం

యాదగిరిగుట్టపైన దేవస్థానంలో ఆధ్వర్యంలో నిర్వ హింపబడుతున్న 'యాదగిరి' మాసపత్రిక కార్యాల యాన్ని చైర్మన్ నరసింహమూర్తి, ఈవోవెంకటరావు సోమవారం ప్రారంభించారు. అనంతరం భక్తులకు తాజా మాసపత్రికను పంపిణీ చేశారు. భక్తులు నేరుగా కార్యాలయానికి వెళ్లి మాసపత్రిక కొనుగోలు చేసుకోవచ్చని ఈవో వెంకటరావు తెలిపారు. ఈ పత్రిక ద్వారా ఆలయం. భక్తుల మధ్య మరింత అనుబంధం ఏర్పడి ఆలయ ఆధ్యాత్మిక, సాంస్కృ తిక విశేషాలు విస్తృతంగా 
వ్యాపింపజేయడానికి ఆస్కారం లభిస్తుందని పేర్కొన్నారు.