Yamaha Motors..3 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది.. ఎందుకంటే..

Yamaha Motors..3 లక్షల స్కూటర్లను రీకాల్ చేసింది.. ఎందుకంటే..

యమహా మోటార్ ఇండియా.. తన 125 సీసీ స్కూటర్ మోడల్ష్ Ray ZR 125 FIహైబ్రిడ్, Fascino 125 FI హైబ్రిడ్ లలో సుమారు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేస్తుంది. స్కూటర్ లోని బ్రేక్ పార్ట్ లో లోపంతో రీపేర్ చేసేందుకు ఇది రీకాల్ చేస్తుంది. జనవరి 1 2022 నుంచి జనవరి 4,2024 మధ్య తయారు చేసిన స్కూటర్లను రీకాల్ చేసిన ట్లు కంపెనీ తెలిపింది. వినియోగ దారులకు విడిభాగాలను ఉచింతంగా అందజేస్తున్నట్లు తెలిపింది. 

బ్రేక్ లివర్ పనిచేయకపోవడం 

 Ray ZR 125 FIహైబ్రిడ్, Fascino 125 FI హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ జనవరి 2022 నుంచి వచ్చిన మోడళ్లలో బ్రేక్ లివర్ లోపం సమస్యను పరిష్కరించేందుకు రీకాల్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సంబంధిత కస్టమర్లకు విడిభాగాలు ఉచితంగా అందించబడతాయని.. కస్టమర్లు కంపెనీ వెబ్ సైట్  సందర్శించి స్కూటర్ రీకాల్ అర్హత కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి ఛాసిస్ నంబర్ వివరాలను నమోదు చేయాలన్నారు. అదనపు సమాచారం కోసం Yamaha సర్వీస్ సెంటర్ ను సందర్శించాలని కంపెనీ తెలిపింది.