మెటా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్‌ను రీ–డిజైన్ చేసింది. 2026 కోసం ఫీడ్, ప్రొఫైల్, సెర్చ్, ఫొటో, వీడియో వ్యూయింగ్, కంటెంట్ క్రియేటింగ్స్లో అప్డేట్స్ కూడా వచ్చాయి. ఫీడ్ ఇక నుంచి మరింత స్మార్ట్గా ఉంటుంది. అందుకోసం కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఒకేసారి ఎక్కువ ఫొటోలు అప్లోడ్ చేస్తే అవి క్లీన్ గ్రిడ్‌లో కనిపిస్తాయి.
ఫొటోలను ఓపెన్ చేయకుండానే లైక్ కొట్టొచ్చు. ఇకపోతే ఏదైనా పోస్ట్‌పై ట్యాగ్ చేస్తే అది ఫుల్ స్క్రీన్‌లో ఓపెన్ అవుతుంది. ఇది మీ పోస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఫేస్బుక్ సెర్చ్‌లో రిజల్ట్స్ ఇప్పుడు గ్రిడ్ లే అవుట్లో కనిపిస్తాయి. ఫొటో, వీడియో రిజల్ట్స్ ద్వారా స్క్రోల్ చేస్తున్నప్పుడు పూర్తి స్క్రీన్ వ్యూ మోడ్‌లో ఉంటుంది. కాబట్టి మీరు ఉన్నచోటే మొత్తం కంటెంట్ చూడొచ్చు.
ఫీడ్‌లోని మెషిన్ లెర్నింగ్ ఫీడ్‌బ్యాక్‌ను అర్థం చేసుకుని తద్వారా కావాల్సిన ఫీడ్‌ను అందిస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది కంటెంట్ క్రియేటింగ్.. కాబట్టి దానికి తగ్గట్లు కూడా ఇందులో మార్పులు చేశారు. ఫేస్బుక్లో పోస్ట్ లేదా స్టోరీని క్రియేట్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. కొత్త ఇంటర్ఫేస్లో మ్యూజిక్ జోడించొచ్చు. ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేయొచ్చు.
కలర్‌ఫుల్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లు వంటి అడ్వాన్స్డ్ టూల్స్ ఒకే ట్యాబ్‌లో ఉంటాయి. పోస్ట్ చేసేందుకు ముందుగానే మీకు వ్యూయర్ సెట్టింగ్‌లు కనిపిస్తాయి. క్రాస్ పోస్టింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. క్రియేటర్లు, గ్రూప్ అడ్మిన్ల కోసం కొత్త మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి. నచ్చని కామెంట్స్‌ను ఫ్లాగ్ చేసే వీలు కూడా ఉంది. ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం బ్యాడ్జ్‌లు ఉంటాయి.
ఇవేకాదు.. ఫేస్బుక్ ప్రొఫైల్‌లో పేరు, నెంబర్‌తోపాటు లైఫ్ స్టయిల్, హాబీలు, ఇంట్రెస్ట్‌లు ద్వారా ఇతరుల గురించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీకు నచ్చిన విషయం అందులో ఉంటే దానికి రిలేటబుల్‌గా ఉన్న ఫ్రెండ్స్‌ని మాత్రమే హైలైట్ చేస్తుంది. అలాగే ప్రొఫైల్‌లో ఎవరు ఏది చూడొచ్చు అనేది కూడా మీరు డిసైడ్ చేయొచ్చు. మీ ఫీడ్‌లోనే ఈ అప్డేట్లను షేర్ చేసుకోవచ్చు.
వెలుగు,లైఫ్
