వారెంటీని పొడిగించిన యమహా, హ్యుందాయ్‌

V6 Velugu Posted on May 15, 2021

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం కొనసాగుతుండటంతో యమహా మోటర్‌ సంస్థ తో పాటుగా హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ లు తమ సర్వీస్‌, వారెంటీ సమయాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. లైఫ్‌టైమ్‌ క్వాలిటీ కేర్‌ అప్రోచ్‌లో భాగంగా ఈ వారెంటీని జూన్‌ 30,2021వ తేదీ వరకూ విస్తరిస్తున్నట్లు  యమహా వెల్లడించగా, హ్యుందాయ్‌ సంస్థ లాక్‌డౌన్‌ జరుగుతున్న ప్రాంతాలలో వారెంటీని రెండు నెలల  పాటు తమ వారెంటీని పొడిగించినట్లు వెల్లడించింది. ఈ సంస్థలు రెండూ తమ వారెంటీలో భాగంగా ఉచిత సర్వీస్‌, సాధారణ వారెంటీ, ఎక్స్‌టెండెడ్‌ వారెంటీని సైతం విస్తరిస్తున్నట్లు వెల్లడించాయి.  యమహా తమ వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ను సైతం వచ్చే జూన్‌ 30 వరకూ విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. హ్యుందాయ్‌ సంస్థ కూడా ఆన్‌లైన్‌ సర్వీస్‌ బుకింగ్‌తో పాటుగా మరెన్నో సదుపాయాలనూ అందిస్తున్నట్లు వెల్లడించింది.

Tagged , covid effect motor industry, corona effect motor industry, automobile industry updates, yamaha warranty extension, hundai warranty extension

Latest Videos

Subscribe Now

More News