
బిల్లీ జీన్ కింగ్ కప్ టోర్నీకి ఎంపిక
రిజర్వ్ ప్లేయర్‌గా శ్రీవల్లికి చాన్స్
న్యూఢిల్లీ : తెలంగాణ యంగ్‌స్టర్ యమలపల్లి సహజ బిల్లీ జీన్ కింగ్ కప్-–ఆసియా ఒసియానియా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నమెంట్‌లో పోటీ పడే ఇండియా విమెన్స్ టీమ్‌కు సెలెక్ట్ అయింది. కొన్నేళ్లుగా ఐటీఎఫ్ సర్క్యూట్‌లో సత్తా చాటుతున్న సహజకు తొలిసారి ఈ టోర్నీలో బరిలోకి దిగే చాన్స్ లభించింది. విమెన్స్ సింగిల్స్‌లో సహజ ఇండియా టాప్4 ర్యాంకర్‌గా ఉంది. రాష్ట్రానికి చెందిన మరో యంగ్‌స్టర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుకు ఎంపికైంది.
ప్రస్తుత ఫామ్, డబ్ల్యూటీఏ ర్యాంక్ ఆధారంగా శాలిని ఠాకూర్ చావ్లా కెప్టెన్సీలోని టీమ్‌లో ఐదుగురితో కూడిన టీమ్‌ను ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) సోమవారం ప్రకటించింది. అంకితా రైనా (ర్యాంక్ 241), కర్మాన్ కౌర్ థండి (268)కి తోడు యంగ్‌స్టర్స్ రుతుజా భోసలే (419), సహజ (454), వైదేహి చౌదరి (492)కి చాన్స్ ఇచ్చింది. ఉజ్బెకిస్తాన్‌లోని తష్కెంట్ వేదికగా ఏప్రిల్ 10 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది.