42లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు .. పంటల సాగులో టాప్‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా

42లక్షల ఎకరాలు దాటిన యాసంగి సాగు .. పంటల సాగులో టాప్‌‌‌‌‌‌‌‌ నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా
  • అత్యల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాలు
  • ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాసంగి సాగు ఇప్పటి వరకు 42 లక్షల ఎకరాలు దాటింది. ఈ మేరకు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. తాజా నివేదిక ప్రకారం.. ఈ యేడు యాసంగిలో 54.93 ఎకరాల విస్తీర్ణంలో సాధారణ సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు అందులో  76.85 శాతం సాగైంది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో లక్ష ఎకరాల లోపే యాసంగి పంటల సాగు నమోదు అయినట్లు వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.

30లక్షల ఎకరాలు దాటిన  యాసంగి వరి సాగు..

రాష్ట్రంలో యాసంగిలో అత్యధికంగా సాగయ్యే వరి పంట ఈ యేడు 30లక్షల ఎకరాలు దాటింది. యాసంగిలో సాధారణ వరి సాగు 40.50 లక్షల ఎకరాలు కాగా అందులో 75శాతం సాగు నమోదైందని వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది. మక్కజొన్న 4.59లక్షల ఎకరాలు, పప్పు శనగ 2.50లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఆ తరువాత పల్లి(వేరుశనగ)1.97లక్షల ఎకరాల్లో సాగు కాగా జొన్న 1.23లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ వివరించింది. 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌.. మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యల్పం

యాసంగిలో నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా 4.41లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగయ్యాయి. ఆ తరువాత నల్గొండ జిల్లాలో 3.67లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగిందని వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.సూర్యపేట జిల్లాలో 3.17లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. రాష్ట్రంలో యాసంగి సాగులో అత్యల్పంగా మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి జిల్లాలో 4656 ఎకరాల్లో, ములుగు జిల్లాలో 5582 ఎకరాల్లో , అసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 17వేల ఎకరాల్లో పంటల సాగు జరిగింది.