IND vs ENG, 3rd Test: జైశ్వాల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ టార్గెట్ 557

IND vs ENG, 3rd Test: జైశ్వాల్ డబుల్ సెంచరీ.. ఇంగ్లాండ్ టార్గెట్ 557

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రాజ్ కోట్ లో పెను విధ్వంసం సృష్టించాడు. డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించాడు. మూడో రోజు సెంచరీతో సత్తా చాటగా.. నాలుగో రోజు అంతకు మించిన ఆటతో చెలరేగాడు. టెస్ట్ క్రికెట్ ని ఒక్కసారిగా టీ20 ఫార్మాట్ ను గుర్తు చేశాడు. 231 బంతుల్లో 10 సిక్సులు,14 ఫోర్లతో తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకొని కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్ గా ఈ ఓపెనర్ ఇన్నింగ్స్ లో 12 సిక్సులున్నాయి.

అండర్సన్ బౌలింగ్ లో జైశ్వాల్ వరుసగా మూడు సిక్సులు కొట్టడం సెకండ్ సెషన్ కే హైలెట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో జైశ్వాల్(214) కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. డబుల్ సెంచరీ అనంతరం  భారత్ తమ సెకండ్ ఇన్నింగ్స్ ను 4 వికెట్ల నష్టానికి 430 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు భారత్ 557 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. జైస్వాల్ కు తోడు మరో ఎండ్ లో సర్ఫరాజ్ ఖాన్ (68) హాఫ్ సెంచరీతో చక్కని సహకారం అందించాడు.

ALSO READ : PSL 2024: పాకిస్తాన్ సూపర్ లీగ్ పోరు మొదలైంది.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

 
5వ వికెట్ కు వీరిద్దరి మధ్య 158 బంతుల్లోనే 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. బౌండరీలతో హోరెత్తించడంతో లంచ్ తర్వాత వీరి ధాటికి భారత్ 14 ఓవర్లోలోనే 116 పరుగులు వచ్చి చేరాయి. అంతకముందు గిల్ 91 పరుగులు చేసి  టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ (19), పటిదార్ (0) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో  ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్, హర్టీలి, రెహన్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.