ముంబై: తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్‌ను తీసుకున్నారు. ఈ మేరకు శనివారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టు వివరాలను వెల్లడించింది.
అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోహ్లీకి ఈ గాయమైంది. గాయంతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ త్వరలోనే సీవోఈకి వెళ్లనున్నాడు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా అక్కడే ఉన్నాడు. ఈ ఇద్దరికి సీవోఈ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తే బరిలోకి దిగుతారని బీసీసీఐ వెల్లడించింది.
జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
