వివేకం సినిమాకు ఈసీ షాక్

వివేకం సినిమాకు ఈసీ షాక్

ఎన్నికలే లక్ష్యంగా, ఒక పార్టీకి కలిసొచ్చేలా సినిమాలు రూపొందించటం ఈ మధ్య ట్రెండ్ అయ్యింది. సినిమాల ప్రభావం జనాల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి పార్టీలన్నీ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఇటీవల వైసీపీకి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా రిలీజ్ కాగా, తాజాగా వివేకా హత్య కేసు కధాంశంగా ప్రతిపక్ష టీడీపీకి కలిసొచ్చేలా వివేకం అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా ఇంటర్నెట్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే, ఈ సినిమాను లైవ్ స్ట్రీమ్ కాకుండా ఆపాలని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

వివేకం సినిమా హింసను ప్రోత్సహించేలా తీశారని, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈ సినిమా ప్రజలను ప్రభావితం చేసేలా ఉందని, అంతే కాకుండా వైసీపీకి నష్టం చేకూర్చేలా ఉందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల సమయంలో బయోపిక్ ఆఫ్ పీఎం అన్న సినిమాను బ్యాన్ చేసిన విధంగా ఈ సినిమాను కూడా బ్యాన్ చేయాలని కోరారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.