టీడీపీ వాళ్లేమో ఒక్కొకరిని కంటారు.. అందరికీ ఇష్టం వచ్చినట్లు కనమని చెబుతారు: పేర్ని నాని

టీడీపీ వాళ్లేమో ఒక్కొకరిని కంటారు.. అందరికీ ఇష్టం వచ్చినట్లు కనమని చెబుతారు: పేర్ని నాని

జనాభా నిర్వహణ గురించి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గతంలో జనాభా నియంత్రణను పెద్దఎత్తున ప్రోత్సహించిన చంద్రబాబు.. ఇప్పుడు ముగ్గురికంటే ఎక్కువమంది పిల్లలలను కంటేనే నిజమైన దేశభక్తి అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వాళ్లేమో ఒకరిని కంటారు.. అందరికీ ఇష్టం వచ్చినట్లు కనమని చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ వాళ్ళు ముందు పిల్లల్ని కనాలని.. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడాలని అన్నారు పేర్ని నాని. రాష్ట్రంలో పోలీసులు రెడ్ బుక్ కోసం మాత్రమే పనిచేస్తున్నారని.. లా అండ్ ఆర్డర్ కోసం పనిచేయటం లేదని మండిపడ్డారు పేర్ని నాని. రాష్ట్రంలోని ఆకృత్యాలలో భాగమే కాకినాడ ఘాటన అని.. కాకినాడ లైంగిక వేధింపుల ఘటన పోలీసుల పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు.

►ALSO READ | ఏంటి గోవిందా ఏం జరుగుతుంది : ప్రముఖ హోటల్స్ లో శ్రీనివాస లడ్డూ పేరుతో అమ్మకాలు

ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పేర్ని నాని. తెలుగు అమ్మ వంటిది, హిందీ పెద్దమ్మ వంటిది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ మోదీని తిడితే అందరూ తిట్టాలా, ఆయన హిందీ నేర్చుకోవాలంటే అందరూ నేర్చుకోవాలా, మరో పదేళ్లు చంద్రబాబును మోయాలి అంటే అందరూ మోయాలా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.