ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం

ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాల్టీల్లో అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లపై అవిశ్వాసం పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ లో అవిశ్వాస కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాజకీయంతో మున్సిపల్ కౌన్సిలర్లు క్యాంప్ కు తరలివెళ్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ లో 12 మంది సభ్యుల్లో 7 గురు గోవా విహారయాత్రకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈవిహార యాత్రలో అధికార పార్టీ చెందిన వారితోపాటు ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది.