ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించిన యెమన్ దేశం

ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించిన యెమన్ దేశం

యెమెన్ హౌతీలు ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించారని సైనిక ప్రతినిధి యాహ్యా సరియా అక్టోబర్ 31న ఒక ప్రకటనలో తెలిపారు. బాలిస్టిక్, రెక్కల క్షిపణుల భారీ బ్యాచ్, వివిధ టార్గెట్స్ వద్ద పెద్ద సంఖ్యలో డ్రోన్‌లు ప్రయోగించబడ్డాయని చెప్పారు.

గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రతిస్పందనగా, "సర్వశక్తిమంతుడైన దేవుని సహాయంతో, మా సాయుధ దళాలు ఆక్రమిత భూభాగాల్లోని ఇజ్రాయెల్ శత్రువు వివిధ లక్ష్యాలపై బాలిస్టిక్,  వింగ్డ్ క్షిపణులను, పెద్ద సంఖ్యలో డ్రోన్‌లను ప్రయోగించాయి" అని Xలో ఒక పోస్ట్ ద్వారా సరియా వివరించారు. మరోవైపు, ఎర్ర సముద్రం ప్రాంతం నుంచి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని యారో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డగించగా, ఇన్‌కమింగ్ డ్రోన్‌లను ఫైటర్ జెట్‌లు కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది.