V6 News

తాగునీటి కొరత రాకుండా ‘యెన్నం జలధార’ :  ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి

తాగునీటి కొరత రాకుండా ‘యెన్నం జలధార’ :  ప్రభుత్వ విప్యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు : వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా తన సొంత నిధులతో వ్యాపారులకు ఉచితంగా కూల్ వాటర్ క్యాన్స్‌‌ ను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్​, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. నగరంలో సోమవారం ఆయన పర్యటించారు. గడియారం చౌరస్తా వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఇక్కడి షాపులకు వచ్చే కస్టమర్లు, అక్కడ పని చేసే కార్మికులు, వ్యాపారులు అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా ‘యెన్నం జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.  

అనంతరం బాలికల జూనియర్ కాలేజీలో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలిసెట్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారునగర పరిధిలోని అప్పన్నపల్లి, ఎదిర డివిజన్లలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో 108 మందికి సీఎంఆర్​ఎఫ్​  చెక్కులు పంపిణీ చేశారు. నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్ ఉన్నారు.