నిన్న సెక్యూరిటీ గార్డ్‌‌... నేడు అదే కంపెనీలో సాఫ్ట్​వేర్​ ప్రొఫెషనల్

నిన్న సెక్యూరిటీ గార్డ్‌‌... నేడు అదే కంపెనీలో సాఫ్ట్​వేర్​ ప్రొఫెషనల్

‘లెర్నింగ్‌‌ ఈజ్‌‌ ద కీ టు సక్సెస్‌‌’ అంటారు. నేర్చుకోవాలనే ఉత్సాహం, నేర్చుకునే టాలెంట్‌‌ ఉంటే ఏదైనా సాధించొచ్చు. దీనికి మరో ఉదాహరణ అబ్దుల్​ అలీమ్‌‌. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్‌‌గా కెరీర్​ మొదలై, ఇప్పుడు అదే కంపెనీలో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ప్రొఫెషనల్​గా చేస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న అబ్దుల్‌‌ అలీమ్‌‌, 2013లో వెయ్యి రూపాయలతో చెన్నై చేరాడు. ఆ తర్వాత అక్కడి ‘జోహో కార్పొరేషన్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ’ ఆఫీస్‌‌లో సెక్యూరిటీ డెస్క్‌‌లో చేరాడు. అలీమ్‌‌ను రోజూ గమనిస్తున్న ఒక సీనియర్‌‌‌‌ ఆఫీసర్‌‌కు‌‌ అబ్దుల్‌‌లో ఏదో ప్రత్యేక టాలెంట్ ఉందనిపించింది. అబ్దుల్​ను ‘‘కంప్యూటర్ నాలెడ్జ్‌‌ ఉందా’’? అని అడిగాడు ఒకరోజు. స్కూల్‌‌లో ఉన్నప్పుడు కొద్దిగా ‘హెచ్‌‌ఎమ్‌‌టీఎల్‌‌’ నేర్చుకున్నాను అని చెప్పాడు అబ్దుల్‌‌.  కంప్యూటర్‌‌‌‌ నాలెడ్జ్‌‌ ఉందని గుర్తించిన ఆఫీసర్‌‌‌‌, రోజూ తన దగ్గరికి వచ్చి కంప్యూటర్‌‌‌‌ కోర్స్‌‌ నేర్చుకోమని చెప్పాడు.
 

కోడింగ్‌‌తో మొదలు
సెక్యూరిటీ గార్డ్‌‌గా డ్యూటీ అయిపోయాక ఆఫీసర్‌‌‌‌ దగ్గరికి వెళ్లి కోడింగ్‌‌ నేర్చుకోవడం స్టార్ట్‌‌ చేశాడు అబ్దుల్​. ఎనిమిది నెలల్లోనే కోడింగ్‌‌ నేర్చుకుని, సొంతంగా ఒక యాప్‌‌ తయారుచేశాడు. ఆ తర్వాత మరిన్ని సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కోర్స్‌‌లు నేర్చుకున్నాడు. దీంతో ఆ ఆఫీసర్‌‌‌‌, మేనేజర్‌‌‌‌తో చెప్పి అబ్దుల్‌‌కు ఇంటర్వ్యూ అరేంజ్‌‌ చేశాడు. ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్‌‌ చేసి, అబ్దుల్‌‌ అదే కంపెనీలో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ఎంప్లాయిగా జాబ్‌‌ తెచ్చుకున్నాడు. ఏ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌‌గా మొదలయ్యాడో, అదే కంపెనీలో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ప్రొఫెషనల్​ స్థాయికి ఎదిగిన అబ్దుల్‌‌ అలీమ్‌‌ సక్సెస్‌‌, యూత్‌‌కు ఇన్‌‌స్పిరేషన్‌‌.