ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ థ్రిల్లర్‌‌గా యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ

ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ థ్రిల్లర్‌‌గా యేవమ్‌‌‌‌‌‌‌‌ మూవీ

చాందిని చౌద‌‌‌‌‌‌‌‌రి, వ‌‌‌‌‌‌‌‌శిష్ట సింహా, భరత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌, ఆషు రెడ్డి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో ప్రకాష్‌‌‌‌‌‌‌‌ దంతులూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘యేవమ్‌‌‌‌‌‌‌‌’. నవదీప్‌‌‌‌‌‌‌‌, పవన్‌‌‌‌‌‌‌‌ గోపరాజు నిర్మించారు. జూన్ 14న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘నేను న‌‌‌‌‌‌‌‌టించి రెస్పెక్ట్ చేసే వాళ్లలో చాందిని చౌద‌‌‌‌‌‌‌‌రి ఒక‌‌‌‌‌‌‌‌రు.  తను మంచి కో స్టార్.  నిర్మాతగా నవదీప్‌‌‌‌‌‌‌‌కు, నటిగా చాందినికి ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.

మరో గెస్ట్‌‌‌‌‌‌‌‌ సందీప్ రాజ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు.  నవదీప్ మాట్లాడుతూ ‘మంచి ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌తో నిజాయితీగా చేసిన డిఫ‌‌‌‌‌‌‌‌రెంట్‌‌‌‌‌‌‌‌ సినిమా ఇది. చాందిని కెరీర్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్‌‌‌‌‌‌‌‌ మూవీ అవుతుంది’ అని అన్నాడు. చాందిని చౌదరి మాట్లాడుతూ ‘పోలీస్ పాత్రలో కనిపిస్తా. యాక్షన్‌‌‌‌‌‌‌‌తో పాటు అన్ని షేడ్స్ నా పాత్రలో ఉంటాయి’ అని చెప్పింది. ఇదొక ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌టైనింగ్ థ్రిల్లర్ అని,  అంద‌‌‌‌‌‌‌‌రికీ న‌‌‌‌‌‌‌‌చ్చుతుందనే న‌‌‌‌‌‌‌‌మ్మకం ఉందని దర్శకుడు ప్రకాష్ అన్నాడు.