వెన్నునొప్పి తగ్గించే ఆసనాలు

వెన్నునొప్పి తగ్గించే ఆసనాలు

ఈ మధ్య కాలంలో పదిలో.. తొమ్మిది మందికి వస్తున్న సమస్య వెన్నునొప్పి. వర్క్‌‌ చేసేటప్పుడు సరిగ్గా కూర్చోకపోవడం, నెలసరిలో  వచ్చే మార్పుల వల్ల ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతుంది. వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్‌‌ వల్ల సరైన సదుపాయాలు లేక ఎలా పడితే అలా కూర్చొని పనులు చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది. వెన్నునొప్పిని చాలామంది తేలికగా తీసుకుంటారు. ‘అదే తగ్గిపోతుందిలే’ అని వదిలేస్తుంటారు. అలా చేస్తే ఫ్యూచర్‌‌‌‌లో చాలా ప్రాబ్లమ్స్‌‌ వస్తామంటున్నారు డాక్టర్లు. అయితే, యోగా ద్వారా ఆ సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చు.  

చైల్డ్‌‌పోజ్‌‌

  • చైల్డ్‌‌పోజ్‌‌ (బాలాసనం)లో మనం పూర్తిగా రెస్ట్‌‌ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక సాగి రిలీఫ్‌‌గా అనిపిస్తుంది. ఈ ఆసనం వేసేందుకు మోకాళ్ల మీద కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు రెండు మోకాళ్లు ఒకదానికొకటి ఆనాలి. పాదాలపై పిరుదులు ఆనిచ్చి కూర్చోవాలి. వజ్రాసనంలో నుదిటిని నేలమీద ఆనించాలి. తరువాత రెండు చేతులు ముందుకు చాచి అరచేతులను బోర్టా పెట్టి నేలమీద ఆనించాలి. ఇలా చేసేటప్పుడు పిరుదులు పాదాలపైనే ఉండాలి. ఈ ఆసనంలో 2 – 3 నిమిషాల పాటు ఉంటే వెన్నె ముకకు రిలీఫ్‌‌ దొరుకుతుంది. 
  • క్యాట్‌‌, కౌ పోజ్‌‌
  • ఇది పూర్తిగా బ్యాక్‌‌స్ట్రెచ్‌‌. ఈ ఆసనాన్ని వెన్నెముక, పొట్ట ఆధారంగా వేస్తారు. మోకాళ్లపై వంగి, చేతులను నేలమీద పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు చేతులు రెండు భుజాల కింద పెట్టాలి. మెడ, వెన్నెముక నిటారుగా ఉండాలి. గాలి పీలుస్తూ, తలపైకి లేపాలి. ఆ తర్వాత మెల్లగా గాలి వదులుతూ తల కిందికి వాల్చి గడ్డం ఛాతివైపు ఉంచాలి. ఈ ఆసనం వేసేటప్పుడు అరచేతులు, మోకాళ్లు నేలకు ఆనుకునే ఉండాలి.  
  • ఈ రెండు ఆసనాలు వేయం వల్ల వెన్నెముక, వెనుక భాగంలోని ఎముకలు గట్టిపడతాయి. రక్తప్రసరణ బాగా జరిగి అప్పర్‌‌‌‌ బ్యాక్‌‌, మెడ భాగంలో ఏదైనా ఇబ్బందులేవైనా ఉంటే పోతాయి. 
  • క్యాట్‌‌కౌ పోజ్‌‌ ఆసనం వల్ల కిడ్నీలు, అడ్రినల్‌‌ గ్లాండ్స్‌‌కు మసాజ్‌‌ జరుగుతుంది. దీంతో అవి యాక్టివ్‌‌గా పనిచేసి బ్యాక్‌‌పెయిన్‌‌  తగ్గిపోతుంది.     
  • ఈ యోగాసనాల్లో వెన్నెముకను నిటారుగా ఉంచడం, స్ట్రెచ్‌‌ చేయడం లాంటివి చేస్తాం. అందుకే, అది ఫ్లెక్సిబుల్‌‌గా తయారవుతుంది. నొప్పులేవైనా ఉంటే తగ్గిపోతాయి. 
  • ప్రతి రోజు ఈ రెండు యోగాసనాలు ప్రాక్టీస్‌‌ చేయడం వల్ల బ్యాక్‌‌ బాగా స్ట్రెచ్‌‌ అవుతుంది. దాంతో  మెనుస్ట్రువల్‌‌ పెయిన్‌‌ కూడా ఉండదు.