లక్షల దీపాలు వెలిగించేందుకు అయోధ్య రెడీ

లక్షల దీపాలు వెలిగించేందుకు అయోధ్య రెడీ

అయోధ్య: దీపావళికి అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం రెడీ అయ్యింది. బుధవారం సరయు తీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది 6 లక్షల దీపాలతో ఉన్న రికార్డును అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయోధ్య పట్టణం మొత్తం దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశామని ఆ జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ చెప్పారు. రామ మందిరంతోపాటు పట్టణంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలతో టేబులాక్స్‌తో కవాతు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. కాగా, దీపోత్సవంలో భాగంగా అయోధ్యలో రామాయణంపై చేసిన శాండ్‌ఆర్ట్‌లు, డ్యాన్సుల ఫొటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్నివార్తల కోసం:

నాపై అర్ధరాత్రి కుట్ర చేశారు: కెప్టెన్

రూ.100తో ఆర్టీసీ బస్సులో రోజంతా ప్రయాణం

నా గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలి: ఈటల