యోగి సభకు మమత బ్రేక్

యోగి సభకు మమత బ్రేక్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ బెంగాల్ పర్యటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. బెంగాల్ లోని దక్షిణ దినాజ్ పూర్ లో బీజేపీ సభకు యోగి హాజరు కావాల్సి ఉండగా… హెలికాప్టర్ దిగేందుకు బెంగాల్ సర్కార్ అనుమతివ్వలేదు. దీంతో లక్నో నుంచి ఫోన్ ద్వారా సభలో ప్రసంగించారు యోగి. అధికారాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్దతి మంచిది కాదన్నారు. బెంగాల్ ప్రభుత్వాధికారులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేయడాన్ని అంగీకరించబోమన్నారు యోగి. బలుఘట్ ఎయిర్ పోర్టులో యోగి చాపర్ కు అనుమతులివ్వకపోవడంతో..  దినాజ్ పూర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు.