రాష్ట్రపతిని కలిసిన యోగి

రాష్ట్రపతిని కలిసిన యోగి

న్యూఢిల్లీ: సోమవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను యూపీకి కాబోయే సీఎం యోగి ఆదిత్యనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 255 సీట్లతో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న జరిగే హోలీ పండగ తర్వాత యోగి రెండోసారి సీఎంగా పదవి చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి వచ్చిన యోగి పలువురు బీజేపీ పెద్దలను కలిశారు. అంతకుముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఆయన నివాసంలో కలుసుకున్నారు యోగి. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ను ప్రగతి పథంలో నడిపించడానికి తనకు అన్ని విధాల సహకరించినందుకు గడ్కరీకి ధన్యవాదాలు అంటూ యోగి స్పందించారు. 

మరిన్ని వివరాల కోసం...

సోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు

మణిపూర్ సీఎం ఎంపికపై తర్జనభర్జన