రైతులకు న్యాయం చేయడంలో యోగి ఫెయిల్

రైతులకు న్యాయం చేయడంలో యోగి ఫెయిల్

న్యూఢిల్లీ: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం చేపట్టిన భారత్ బంద్‌ విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఆరోపణలకు దిగారు. యోగి సర్కారు రైతులకు న్యాయం చేయడంలో ఫెయిల్ అయిందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించలేదని రాకేశ్ తికాయత్ అన్నారు. చెరకు మద్దతు ధరను రూ.375 నుంచి రూ.450 వరకూ పెంచుతామని గత ఎన్నికల సమయంలో యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారని, కానీ కేవలం 25 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. నష్టాలపాలైన రైతులకు యోగి సమాధానం చెప్పాలని తికాయత్ డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 40 రైతు సంఘాలతో కలిసి ఏర్పడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ రోజు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి కొన్ని కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ, వైసీసీ సహా అనేక ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లోని హైవేలను రైతు సంఘాలు బ్లాక్ చేశాయి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రైలు రోకోలు కూడా చేయడంతో ట్రైన్ సర్వీసులను బంద్ చేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తల కోసం..

పోలీస్ ఆఫీసర్ పైకి దూసుకెళ్లిన రైతు నేత కారు

స్టైలిష్ హెయిర్‌‌ కట్‌, షేవింగ్‌పై బ్యాన్

నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్