ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి : యోగితా రాణా

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు కృషి : యోగితా రాణా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో పలు  ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, పదోతరగతి ఫలితాలు, బోధనా పద్ధతులపై ఆరా తీశారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీఈవోలు, ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు,సెక్టార్ అధికారులతో  సమావేశమయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయిస్తోందని, ఉమ్మడి జిల్లాకు సంబంధించి విద్యాప్రగతిలో మార్పు కనిపించాలని సూచించారు.  విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, విద్యాశాఖ జాయింట్​డైరెక్టర్లు​మదన్ మోహన్, వెంకట నర్సమ్మ, ఆర్జేడీ విజయలక్ష్మి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మేరాజ్ ఉల్లా ఖాన్, డీఈవో ప్రవీణ్ కుమార్​ ఉన్నారు. 

రవాణా భత్యం ప్రతీ నెల విడుదల చేస్తాం

జడ్చర్ల, వెలుగు: మానసిక వికలాంగుల రవాణా భత్యం ప్రతీ నెల విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా హామీ ఇచ్చారు. జడ్చర్ల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్​ ల్యాబ్​ను ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఎమ్మార్సీ భవనంలోని భవిత సెంటర్​ను సందర్శించారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  అడిషనల్​కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,  డీఈవో ప్రవీణ్​కుమార్ పాల్గొన్నారు.