వీడియో: నువ్వేమైనా ధోనీవా ఏంటీ? ఓవరాక్షన్ వద్దు

వీడియో: నువ్వేమైనా ధోనీవా ఏంటీ? ఓవరాక్షన్ వద్దు

ఆటగాళ్లు ఎంత  బాగా రాణించినా.. ఎన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా విమర్శలు రావడమన్నది కామన్. ఆటకు విరామం పలికిన మాజీ దిగ్గజాలు ఏదో ఒక సందర్భంలో ఇతరుల విషయాల్లో వేలుపెడుతూ వివాదానికి కాలు దువ్వుతుంటారు. ఆపై వారి ఇచ్చిన కౌంటర్‌కు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నోరెళ్లబెడుతుంటారు. అలాంటి ఘటన ఒకటి మూడో వన్డేలో చోటుచేసుకుంది.

ఇషాన్ కిషన్ vs ఆకాశ్ చోప్రా

మూడో వన్డేలో కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆకాశ్ చోప్రా.. కిషన్ బ్యాటింగ్‌లో కాకుండా స్టంపింగ్ విషయంలో ధోనీతో పోల్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్త వాడీ వేడిగానే సంభాషణ జరిగింది. ఇషాన్ ఓ స్టంపింగ్ చేయగా.. దాని గురించి ఆకాశ్ వివరిస్తూ ధోనీ పేరు ప్రస్తావించారు.

"స్టంపింగ్, రనౌట్‌ల విషయంలో రివ్యూ కోరడం చాలా అరుదు. ఇప్పటివరకైతే అతని పాదం గ్రౌండ్‌పైనే ఉంది. ఇషాన్ నువ్వు రాంచీ నుంచే వచ్చి ఉండొచ్చు కానీ.. ఎమ్మెస్ ధోనీ కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఇషాన్.. "హా, ఫిర్ ఠీక్ హై (హా సరే అయితే).." అని బదులిచ్చారు. 

ఇషాన్ ఇచ్చిన కౌంటర్‌కు ఏం మాట్లాడాలో తెలియక ఆకాశ్ చోప్రా కాసేపు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవాలి అన్నట్లుగా  "ఇషాన్ ఆన్సర్ కూడా ఇచ్చారు.. హౌ స్వీట్ ఇషాన్. వీ లవ్ యూ" అని సముదాయించుకున్నారు. దీనికి కూడా బదులిచ్చిన ఇషాన్.. హా, సరే అయితే అన్నాడు. వీరి సంభాషణ స్టంప్ మైక్ లో వినిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా, విండీస్ పర్యటనలో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడనే చెప్పాలి. టెస్ట్ సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోక పోయినా..  వన్డేల్లో మాత్రం ఇరగదీశారు. వరుసగా మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీ(52, 55, 77)లు బాది మాజీ క్రికెటర్లు కృష్ణమాచారి, దిలీప్ వెంగ్‌సర్కార్, మహమ్మద్ అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, శ్రేయస్ అయ్యర్‌ల సరసన నిలిచారు.