
ప్రస్తుత కాలంలో చాలామంది ఇళ్ల లోనే ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. చేతిలో ఫోన్ కాసేపు లేకపోయినా, ఎదురుగా కనిపించకపోయినా విపరీతమైన ఆందోళన, భయం పెరుగుతున్నాయట యంగ్ స్టర్స్ లో . ఇది పైపై లెక్కలకి చెప్తున్న విషయం కాదు... కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ రిపోర్టులో ఈ విషయం బయటపడింది.
ఇలా యాంగ్జెటీ అనుభవించేవారు లాంగ్ టర్న్ ఇతరుల కంటే ఎక్కువగా అబ్సెసిస్ కంపల్సివ్ డిజార్డర్ బారిన పడతా రని స్టడీ హెచ్చరిస్తోంది. రోజుకు నాలుగు నుంచి ఏడు గంటలు మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు వెల్లడైంది. ఇందులో ఇంటర్నెట్ సెర్చింగ్, ఫ్రెండ్స్ తో వీడియో చాటింగ్, సోషల్ మీడియాలలో ఉండేందుకే 95 శాతం టైం వెచ్చిస్తున్నారట.. ఇలాంటి వాళ్లంతా ఒక్క నిమిషం ఫోన్ చేతిలో లేకున్నా.. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని రీసెర్చ్ లో వెల్లడైంది. “టీనేజ్ లో ఉన్నప్పుడు ఎక్కువగా యాంగ్జెటీకి లోనయ్యేవా ళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ" అని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ చేసిన స్టడీ... హార్ట్ ప్రాబ్లమ్స్ కేవలం పెద్దవాళ్లకు మాత్రమే వస్తాయనుకో వడం అపోహని ఆ స్డడీ ద్వారా తెలుస్తోంది.
యంగ్ ఏజ్ లో ఎక్కు వగా యాంగ్జెటీకి లోనయ్యేవాళ్లలో ఎక్కువమంది మధ్య వయసుకు వచ్చేసరికి గుండెపోటు బారిన పడతారు. ఇది పెద్దవాళ్ల కంటే 20 శాతం ఎక్కువగా ఉందనేది ఆ స్టడీ సారాంశం. అందుకని... సెల్ ఫోన్ హస్తభూషణం అంటూ.. అందులోనే పూర్తిగా మునిగిపోకుండా... కాస్త చుట్టపక్కల ఉన్న ప్రపంచాన్ని కూడా చూడాలి... నలుగురితో మాట్లాడాలి.