టూల్స్ గాడ్జెడ్స్ : ఫోన్​ని ఛార్జ్​ చేసే కీచైన్​!

టూల్స్ గాడ్జెడ్స్ : ఫోన్​ని ఛార్జ్​ చేసే కీచైన్​!

ఫోన్​ని ఛార్జ్​ చేసే కీచైన్​!

పోర్టబుల్​ పవర్​ బ్యాంక్​

వెళ్లిన ప్రతిచోటికి పవర్​ బ్యాంక్​ తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. కానీ ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్​ పూర్తిగా అయిపోయి.. ఎమర్జెన్సీగా ఫోన్​ చేసుకోవాల్సి వస్తే? అలాంటప్పుడు ఈ కీ చైన్​ దగ్గరుంటే చాలు. దీంతో మొబైల్​ని ఛార్జింగ్​ చేసుకోవచ్చు. అదేంటి కీచైన్​తో మొబైల్​ని ఛార్జ్​ చేస్తాం? అంటారా? మామూలు కీచైన్​తో అయితే సాధ్యపడదు. కానీ ఇది పవర్​ బ్యాంక్​ కీచైన్‌. దీంతో ఎమర్జెన్సీ టైంలో మొబైల్​ని కాసేపు ఛార్జ్​ చేసుకోవచ్చు. ఇందులో1600mAh హై క్వాలిటీ బ్యాటరీ ఉంటుంది. చాలా చిన్న సైజులో ఉంటుంది. 

ధర: 1,099 రూపాయలు

 

ఛార్జింగ్​ ఎక్స్​టెన్షన్​బాక్స్

కంప్యూటర్​ కోసం చాలామంది పవర్​ ఎక్స్​టెన్షన్​ బాక్స్​లను వాడుతుంటారు. కానీ.. ఇప్పుడు అందరూ ఎక్కువ గాడ్జెట్స్​ వాడుతుండడంతో వాటన్నింటికీ ఛార్జింగ్​ పెట్టాల్సి వస్తుంది. దాంతో ఆ బాక్స్​లకు ఉండే పవర్​ సాకెట్లు కూడా సరిపోవడం లేదు. అందుకే కొందరు చాలా ఎక్కువ సాకెట్లు ఉండే బాక్స్​లను కొంటున్నారు. కానీ.. ఈ పవర్​ ఛార్జ్​–2 బాక్స్​ ఉంటే ఆ అవసరం లేదు. లైవ్​ టెక్​ కంపెనీ ప్రత్యేకంగా ఒక పవర్​ ఎక్స్​టెన్షన్ బాక్స్​ని మార్కెట్​లోకి తెచ్చింది. దీనికి యూనివర్సల్ పవర్ సాకెట్లతోపాటు యూఎస్​బీ పోర్ట్‌లు కూడా ఉంటాయి. పవర్​ సాకెట్లలో యూఎస్​ ప్లగ్, యూకే ప్లగ్ పెట్టుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా వాడేందుకు ఇది సరిపోతుంది. దీనికి 5 యూఎస్​బీ ​ఛార్జింగ్ పోర్ట్‌లు ఉంటాయి. అవి క్వాల్కమ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తాయి. అంతేకాదు.. దీనికి ఆటో షట్ టైమర్ కూడా ఉంటుంది. సెట్​ చేసి పెట్టుకున్న టైంకి ఛార్జ్​ అవడం ఆగిపోతుంది. ప్రతి ప్లగ్‌లో ప్లాస్టిక్ ఇన్సర్ట్‌లు ఉంటాయి. ఇవి పిల్లల చిన్న వేళ్లు పెట్టకుండా కాపాడతాయి.

ధర: 1,249 రూపాయలు

ఎలక్ట్రిక్ ఎయిర్ బ్లోయర్

ఇంట్లో కెమెరాలు, ఎలక్ట్రిక్​ గాడ్జెట్లు ఎక్కువగా ఉన్నవాళ్లు వాటిని క్లీన్​ చేసేందుకు చాలా ఇబ్బంది పడతారు. కానీ.. ఈ గాడ్జెట్​ ఉంటే దుమ్ము, ధూళిని ఈజీగా క్లీన్​ చేయొచ్చు. వీఎస్​జీవో కంపెనీ దీన్ని తయారుచేసింది. ఇందులో 1,00,000rpm హై-స్పీడ్ ట్యూరో మోటారు ఉంటుంది. ఎయిర్​ పవర్​ 120km/h వరకు ఉంటుంది. ముఖ్యంగా కెమెరాలు, లెన్స్​ల్లో ధూళిని క్లీన్​ చేయడానికి ఇది బెస్ట్‌ గాడ్జెట్​. ఈ బ్లోయర్ చాలా చిన్నగా ఉంటుంది. ఎత్తు 4.5 అంగుళాలు మాత్రమే. అందుకే మీరు ఎక్కడికెళ్లినా జేబులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. ఇందులో 1200 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక గంట పనిచేస్తుంది. యూఎస్​బీ టైప్​–సి ఛార్జర్​తో ఛార్జింగ్​  పెట్టుకోవచ్చు.              

ధర: 9,677 రూపాయలు

ఆర్టికెల్​ డెస్క్

ఇప్పుడు చాలా కంపెనీలు ఉద్యోగులు ఆఫీస్​కు వచ్చి పనిచేస్తామంటున్నా ‘నో’ అంటున్నాయి. వర్క్​ ఫ్రం హోం చేయాలని కండిషన్లు పెడుతున్నాయి. అందుకే ఇంట్లో కూడా ఆఫీస్​లో ఉండే​ ఫెసిలిటీస్​ ఏర్పాటు ​ చేసుకుంటున్నారు చాలామంది. ముఖ్యంగా మంచి డెస్క్​ కొంటున్నారు. అలాంటివాళ్లకు ఇది  బెస్ట్ చాయిస్. దీన్ని ఇండస్ట్రియల్​ -గ్రేడ్ స్టీల్ ఫ్రేమ్, ఇంటర్నల్​ ఎలక్ట్రిక్ మోటార్ లిఫ్ట్ మెకానిజంతో తయారుచేశారు. ఈ స్టాండింగ్ డెస్క్ ఎత్తుని కావాల్సినట్టు పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. నాలుగు ప్రోగ్రామబుల్ హైట్ ప్రి–సెట్‌లు కూడా ఉన్నాయి. చైల్డ్ లాక్ బటన్ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ యూఎస్​బీ పోర్ట్‌లు ఉన్నాయి. స్టోరేజ్ డ్రాయర్ కూడా ఉంది. 

ధర: 29,999 రూపాయలు