ట్విట్టర్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్‌

ట్విట్టర్ యూజర్స్ కు గుడ్ న్యూస్.. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్‌

ట్విట్టర్‌ బాస్‌, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్‌మస్క్.. ఎక్స్‌ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎక్స్‌ (X)లో ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండానే యూజర్లు.. పరిచయస్తులతో కాల్స్‌ మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

గతేడాది మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ 'ట్విట్టర్' (ఎక్స్‌)ను కొనుగోలు చేసిన మస్క్‌.. ఆనాటి నుంచి సమూల మార్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును 'ఎక్స్'గా మార్చిన మస్క్.. పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను పెట్టారు. ఇప్పుడు వాట్సాప్ తరహాలో ఉచితంగా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్‌ సహా వినియోగదారులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.