ఏసీ లేకుండా వెచ్చగా ఉంటేనే మంచి నిద్ర పడుతుందట..!

ఏసీ లేకుండా వెచ్చగా ఉంటేనే మంచి నిద్ర పడుతుందట..!

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి దాదాపు ఏడు గంటల నిద్ర అవసరం. ప్రతి రోజూ సరిపడ నిద్రపోయినా, మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంటుంది చాలామందికి. దానికి భుక్తాయాసం, అలసట, నిద్రలేమి కారణాలు కావచ్చు అనుకుంటారు. కానీ, టెంపరేచర్ కూడా ఒక కారణమే అంటున్నాడు రీసెర్చర్ మార్కో గాలియో.

అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన న్యూరోబయాలజిస్ట్ మార్కో నుసి పురుగుల మీద ఈ ప్రయోగాన్ని చేశాడు. వేడిగా ఉంటే నిద్రపట్టదనుకుంటారు. కానీ, వర్షాకాలం, చలి కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ చల్లదనానికి నిద్ర పట్టక, వేడికోసం దుప్పటి కప్పుకొని నిద్రపోతారు. అలాగని ఎక్కువ వేడి కూడా శరీరం భరించలేదు. శరీరానికి సరిపడా వేడి తగిలితే నిద్ర బాగా పడుతుందని నిరూపించాడు. మార్కో. ఇంతకీ మంచి నిద్రకు ఎంత టెంపరేచర్ అవసరం తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా. అందుకు 77 నుంచి 100 డిగ్రీస్ ఫారెన్ హీట్ కావాలి. మనిషి, నుసి పురుగుల మెదడులోని న్యూరాన్ల పనితీరు ఒకేలా ఉంటుంది. అందుకే వాటిపై ప్రయోగాన్ని చేశాడు మార్కో. మెదడులో థర్మామీటర్ న్యూరాన్లు ఉంటాయని, అవే శరీరానికి ఎంత టెంపరేచర్ కావాలో సిగ్నల్స్ పంపుతాయని కనుగొన్నాడు. మధ్యాహ్నం తిన్న ఆహారం అరిగే టైంలో శరీర ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులే నిద్రకు కారణం అని చెప్తున్నాడు మార్కో.