ఆన్​లైన్​లోనే కేవైసీ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు

ఆన్​లైన్​లోనే కేవైసీ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు

బ్యాంకులు తమ కస్టమర్ల తాజా కేవైసీ స్టేటస్​ సంబంధించి తమ డేటాబేస్‌‌‌‌ను అప్‌‌‌‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్​బీఐ రూల్స్​ ప్రకారం ఇది తప్పనిసరి. కేవైసీ  చేయని వారి బ్యాంక్ ఖాతాను సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కేవైసీని పూర్తిగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎలా అప్‌‌‌‌డేట్ చేయాలో తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే అవసరమైన  డాక్యుమెంట్లు సమర్పించి, చిరునామాను మార్చుకోకపోతే 'నో యువర్​ కస్టమర్' (కేవైసీ) వివరాలను అప్‌‌‌‌డేట్ చేయడానికి బ్యాంక్ శాఖలను సందర్శించాల్సిన అవసరం లేదు. మీ కేవైసీ సమాచారంలో ఎటువంటి మార్పూ లేకుంటే, మీరు ఈ–మెయిల్ -ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ ఛానెల్‌‌‌‌ల ద్వారా సెల్ఫ్​-డిక్లరేషన్‌‌‌‌ను సమర్పించవచ్చు.  ఈ ఏడాది జనవరిలో ఆర్​బీఐ  జారీ చేసిన సర్క్యులర్‌‌‌‌ ప్రకారం.. కేవైసీ సమాచారంలో మార్పు లేకుంటే, సెల్ఫ్​ డిక్లరేషన్​ ఇస్తే సరిపోతుంది. “రిజిస్టర్డ్ ఈ–మెయిల్-ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు, డిజిటల్ వంటి  ఛానెల్‌‌‌‌ల ద్వారా వ్యక్తిగత ఖాతాదారులకు సెల్ఫ్​-డిక్లరేషన్ సౌకర్యాన్ని అందించాలని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చాం. బ్యాంకు శాఖను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఛానెల్‌‌‌‌లు (ఆన్‌‌‌‌లైన్ బ్యాంకింగ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్), లెటర్​ మొదలైన వాటిని ఉపయోగించుకోవచ్చు”అని ఆర్​బీఐ పేర్కొంది. 

కేవైసీ వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఎలా అప్‌‌‌‌డేట్ చేయాలంటే...

అడ్రస్​ మారకుంటే.. గతంలో  సమర్పించిన కేవైసీ పత్రాలే సరిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో మీ కేవైసీని రెన్యువల్​ చేసుకోవడానికి సెల్ఫ్​-డిక్లరేషన్‌‌‌‌ను సమర్పించవచ్చు. కేవలం చిరునామా మారితే మాత్రం డిజిటల్​ఛానెల్‌‌‌‌లలో ఏదో ఒక దాని ద్వారా కొత్త చిరునామాలను అందించవచ్చు. ఆ తర్వాత రెండు నెలల్లో బ్యాంక్ డిక్లేర్డ్ అడ్రస్ వెరిఫికేషన్​ చేపడుతుందని ఆర్​బీఐ సర్క్యులర్‌‌‌‌  పేర్కొంది. కేవైసీ డాక్యుమెంట్  చెల్లుబాటు గడువు ముగిసినా లేదా సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్​ ఇకపై అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ కాకపోయినా (ఓవీడీ) బ్యాంకుకు వెళ్లి ఓవీడీ లిస్టులో పేర్కొన్న వాటిలో ఏదో ఒక డాక్యుమెంటు అందజేయాలి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కస్టమర్లు  https://www.hdfcbank.com/personal/useful-links/important-messages/re-kyc-update లింక్​ ద్వారా వారి కేవైసీని ఆన్​లైన్లో అప్‌‌‌‌డేట్ చేయవచ్చు. 

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌‌‌‌లు తమ కేవైసీ వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ చేయడానికి ఐమొబైల్​ యాప్‌‌‌‌ని ఉపయోగించవచ్చు. ఈ బ్యాంకు కస్టమర్లు ముందుగా ఐమొబైల్​ యాప్‌‌‌‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఐడీ, పాస్ట్​వర్డ్స్​ ఉపయోగించి లాగిన్ కావాలి.   మొబైల్ బ్యాంకింగ్ డ్యాష్‌‌‌‌బోర్డ్‌‌‌‌లో ‘అప్‌‌‌‌డేట్ కేవైసీ’ బ్యానర్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయడం ద్వారా  కేవైసీ అప్​డేషన్​ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఇందుకు కొద్ది సమయమే పడుతుంది.  కేవైసీ అప్‌‌‌‌డేషన్ నియమాలను పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. సంబంధిత కస్టమర్​ బ్యాంకు లావాదేవీలపై పరిమితి విధింవచ్చు. లేదా బ్యాంకింగ్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలూ ఉంటాయి. బ్యాంక్ ఖాతాతో లావాదేవీలను నిర్వహించడానికి  ఉపయోగపడకపోవచ్చు. కేవేసీ అప్‌‌‌‌డేట్ చేయకపోవడం ఖాతా మూసివేయడానికి కూడా దారితీయవచ్చని ఆర్​బీఐ హెచ్చరించింది. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు.. కేవైసీని అప్‌‌‌‌డేట్ చేసుకోవాలని ఖాతాదారునికి బ్యాంక్ సూచిస్తుంది.