జీ మెయిల్ యూజర్లకు షాక్...డబ్బులు చెల్లించాల్సిందే

జీ మెయిల్ యూజర్లకు షాక్...డబ్బులు చెల్లించాల్సిందే

స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతీ ఒక్కరికి జీమెయిల్ ఉంటుంది. ఈ రోజుల్లో జీ మెయిల్ లేని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పటి వరకు జీమెయిల్ ను ఉచితంగా ఉపయోగిస్తున్నాం. కానీ అతి త్వరలో ఉచిత సేవ నిలిచిపోయింది. ఇకపై జీమెయిల్ ను ఉపయోగించాలంటే కూడా డబ్బులు చెల్లించాల్సిందే. 

జీమెయిల్ కూడా యూట్యూబ్  బాటలో పయనించబోతుంది. జీమెయిల్లో ప్రకటనలతో లాభాలు అర్చించేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.  యూట్యూబ్ లో ప్రకటనలు చూడకూడదనుకుంటే నెలవారీ సబ్ స్క్రిప్ఫన్ ప్లాన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీమెయిల్ లోనూ ప్రకటనలను చూడకూడనుకుంటే నెలవారీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అతి త్వరలో జీమెయిల్ లో గూగుల్ ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రకటనలతో  సమస్యలు

జీ మెయిల్ మధ్యలో ప్రకటనలు రావడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చాలా మంది జీమెయిల్ యూజర్లు దీనిపై గూగుల్ కు ఫిర్యాదు కూడా చేశారు. జీమెయిల్ లో ప్రకటనలు రావడంపై నియోగదారులు గూగుల్  పై మండిపడుతున్నారు.  ప్రకటనల కారణంగా మెయిల్‌ను నావిగేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు.

 వారం నుండి ప్రకటనలు

జీమెయిల్ లో మొబైల్, వెబ్ వెర్షన్‌లలో వారం రోజుల నుంచి  గూగుల్ ప్రకటనలు వస్తున్నాయి. అయితే గతంలోనూ Gmailలో ప్రకటనలు వచ్చేవి. కానీ అవి మెయిల్‌లలో పై భాగంలోనే ఉండేవి. కానీ ఇప్పుడు మెయిల్  మధ్యలో ప్రకటనలు రావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


జీమెయిల్ కు కూడా బ్లూ టిక్స్

ట్విట్టర్ మార్గంలోనే గూగుల్ ప్రయాణిస్తోంది. వెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ టిక్ మార్క్ ను  ఇస్తున్నట్టుగా.. జీ మెయిల్  కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. యూజర్ల  గుర్తింపును ధృవీకరించడానికి.. ఆన్లైన్ స్కామ్‌లను తగ్గించడానికి.. ఈ మెయిల్ పంపినవారి పేరు పక్కన బ్లూ టిక్ ను  తీసుకు వస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది.