మీకు తెలుసా..జానకి పాత్రలో కృతి సనన్ కాదట

మీకు తెలుసా..జానకి పాత్రలో కృతి సనన్ కాదట

ప్రభాస్ (Prabhas) రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ సినిమా మిక్స్ డ్ టాక్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రామాయణ ఇతిహాస గాథలో జానకి గా నటించాలంటే ఎంతో అభినయం ఉండాలి.అటువంటి జానకి పాత్రలో నటించడం కృతి సనన్ (Kriti Sanon) కి దక్కిన వరం అని చెప్పుకోవాలి.ముందుగా ఈ పాత్ర కోసం అనుష్క శర్మ(Anushka Sharma),కీర్తి సురేష్(Keerti Suresh) తో పాటు మరో ఇద్దరినీ సెలెక్ట్ చేసినట్లు సమాచారం.ఈ సినిమా విడుదల తర్వాత జానకి గా నటించిన కృతి సనన్ నటనకి మంచి మార్కులే వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. 

 ఇక రాముడి పాత్ర విషయంలో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా,రామాయణాన్ని అపహాస్యం చేసేలా సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో హిందూ సేన నాయకుడైన 

విష్ణు గుప్తా(Vishnu Gupta) ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు వేశాడు. 

రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ లేటెస్ట్ రామాయణం ఎక్కడ పొంతన లేని పాత్రల పరిచయంతో,స్పష్టత లేని గ్రాఫిక్ విజువల్ తో అభిమానులని పూర్తిగా నిరాశ పరిచినట్లు తెలుస్తుంది.