చెన్నైని ఓడించడానికి అదొక్కటే మార్గం

V6 Velugu Posted on Sep 27, 2021

ఐపీఎల్ పద్నాలుగో సీజన్, ఫేజ్ 2లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో నెగ్గిన సీఎస్కే.. ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరయింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టిస్తున్న చెన్నైని ఎలా ఓడించాలో చెబుతున్నాడు సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ధోనీ జట్టును ఓడించాలంటే ప్రత్యర్థి టీమ్స్ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని సెహ్వాగ్ అన్నాడు. 

'సీఎస్కే టీమ్ వరుసగా మూడో మ్యాచ్ లోనూ గెలిచింది. యూఏఈ గడ్డపై అడుగుపెడుతూనే చెన్నై మిగతా జట్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఆ జట్టు బాగా ఆడినప్పుడు వారిని ఓడించడం ప్రత్యర్థి టీమ్స్ కు కష్టసాధ్యం. బౌలింగ్ లో ఆ టీమ్ కాస్త బలహీనంగా ఉంది. అయినా సరే, సీఎఎస్కే పై నెగ్గడం అంత సులువు కాదు. మొత్తం 40 ఓవర్లు బాగా ఆడాలి, అప్పుడే గెలవగలం. ఆస్ట్రేలియాతో ఎలాగైతే ఆడతామో అదే రీతిలో ఆడాలి' అని వీరూ సూచించాడు.

For More News..

మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ డెడ్ బాడీ లభ్యం

స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండి

Tagged ipl 2021, MS Dhoni, CSK, Virender Sehwag, ipl 14, Chennai Super Kings Kolkata night riders

Latest Videos

Subscribe Now

More News