పొంగులేటి దయతో ఎమ్మెల్యేను కాలేదు : రాములు నాయక్

 పొంగులేటి దయతో ఎమ్మెల్యేను కాలేదు : రాములు నాయక్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తూ కార్యకర్తలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. తన గెలుపులో పొంగిలేటి పాత్ర ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ప్రజలు ఆశీర్వాదంతోనే తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. పొంగులేటి ఎన్ని ఆత్మీయ సమ్మేళనాలు, సభలు పెట్టినా ఒరిగేదేమీ లేదన్న రాములు నాయక్.. రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తే ఆయన సత్తా ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాడుకొని పొంగులేటి ఈ స్థాయికి ఎదిగాడని ఆరోపించిన ఆయన.. ధన రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదని చెప్పారు.

అంతకు ముందు వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో రాములు నాయక్ పాల్గొన్నారు. సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ అని కొనియాడారు.