శివరాత్రి రోజు ఈ విధంగా అభిషేకం చేస్తే దోషాలు పోతాయి

శివరాత్రి రోజు ఈ విధంగా  అభిషేకం చేస్తే  దోషాలు పోతాయి

 శివుడు అభిషేక ప్రియుడు... కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే చాలు పొంగిపోతాడు. శివరాత్రి రోజు అర్చన, అభిషేకంతో సదాశివుడి అనుగ్రహం పొందితే జీవితంలో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజున కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సానిధ్యాన్ని చేరుకుంటారట.మహా శివరాత్రి రోజు శివయ్యకు  అభిషేకం చేస్తే జన్మ దోషాలు తొలగిపోతాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించడం వల్ల జాతకంలోని అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎటువంటి వాటితో శివలింగాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూద్దాం.

మార్చి 8వ తేదీ శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం జరుపుకోనున్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి, జాగారం చేస్తారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఈసారి మహాశివరాత్రి రోజున అద్భుతం జరగబోతుంది. ఆరోజు శివయోగంతో పాటు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయి. చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. శివరాత్రి పర్వదినాన్ని పూర్తి ఆచారాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. మహాశివరాత్రి చతుర్దశి తేదీ ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం త్రయోదశి తిథితో కలిసి వస్తుంది. ఆరోజు మాసిక్ శివరాత్రి, ప్రదోష వ్రతం కలిసి రావడంతో శివయ్యని పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు. సాధారణంగా అందరి దేవుళ్ళను పగటిపూట పూజిస్తారు. కానీ శివుడిని మాత్రం పగలు, రాత్రి తో సంబంధం లేకుండా పూజిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడికి అర్చన చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంటుంది.

శివలింగాన్ని అభిషేకిస్తే దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించడం వల్ల  జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసిక క్షోభ సమస్యలు, తల్లి ఆరోగ్య సమస్యలు సమసిపోతాయి. స్నేహితులతో సంబంధాలు, ఇల్లు, వాహన సౌఖ్యం లభిస్తుంది. గుండె జబ్బులు, కంటి రుగ్మతలు, కుష్టు వ్యాధులు, చర్మ సంబంధిత సమస్యలు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు, కఫం, న్యూమోనియా సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

శివుడికి ఇష్టమైన పత్రాలు బిల్వ దళాలు. ..శివలింగం మీద ఒక చెంబు మంచినీళ్లు పోసి బిల్వపత్రాలు ఉంచినా సరే శివయ్య మనసు కరిగిపోతుంది. శివరాత్రి రోజు శివలింగం బిల్వ దళాలు ఉంచి పూజ చేయడం వల్ల వ్యాపారంలో పురోగతి, సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతాయి. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఇంట్లోని అలజడలు, దుష్టశక్తుల ఇబ్బందులు, ఆందోళనలు తొలగిపోతాయి. మందార పువ్వు సమర్పించడం వల్ల కంటి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు, పండ్లు సమర్పించడం వల్ల మాదకద్రవ్యాల అలవాటు నుంచి బయటపడతారు. విష జీవుల వల్ల కలిగే ప్రమాదం తొలగిపోతుంది.

జాగరణ, రుద్రాభిషేకం ప్రాముఖ్యత

శివరాత్రి రోజు జాగరణ చేస్తారు. రాత్రంతా నిద్ర లేకుండా మేల్కొని ఉంటూ శివనామస్మరణ జపిస్తూ ఉంటే శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి కోరిక మేరకు శివుడు శివరాత్రి సూత్రాన్ని చెప్పి శివరాత్రి రోజున ఉపవాసం ఉన్నవాడు తనకి ప్రీతిపాత్రుడుగా ఉంటాడని చెప్పాడు. అందుకే శివరాత్రి రోజు జాగరణ చేస్తే వెయ్యి రెట్ల ఫలితం దక్కుతుంది.
శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుడు పులకించిపోతాడు. ధూప, దీపాలతో, పూలతో భోలేనాథుడిని పూజించాలి. ఉపవాసం ఉంటే శివుడు సంతోషిస్తాడు.

ఈ వస్తువులు దానం చేయండి

శివరాత్రి రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ఆహార వస్తువులు, వస్త్రాలు దానం చేయడం వల్ల శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి.

నెయ్యి

శివలింగంపై కొద్దిగా నెయ్యి రాసి పూజ చేయడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడు. మీ జీవితంలోని సమస్యలను నివారించడానికి పేదలకు నెయ్యి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలతో పాటు, ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుంది.

పాలు

మహా శివరాత్రి సందర్భంగా పాలాభిషేకం చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. విశ్వాసాల ప్రకారం శివలింగంపై పాలు పోయడం వల్ల జన్మకుండలిలో బలహీనమైన స్థానంలో ఉన్న చంద్రుడిని బలోపేతం చేస్తారు. ఇది భక్తులకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

నల్ల నువ్వులు

శివరాత్రి నాడు శివుడికి నల్ల నువ్వులు నైవేద్యంగా సమర్పించడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు. పితృ దోషాన్ని తొలగిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

వస్త్ర దానం

మహా శివరాత్రి నాడు పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మీ జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. అప్పులు బాధలు తీరిపోతాయి. భక్తులకు శివుని అనుగ్రహం లభిస్తుంది. వీటితోపాటు పంచదార, తేనె, చందనం వాటిని శివుడికి సమర్పించవచ్చు.