టాలీవుడ్ లో మరో విషాదం.. యువ హీరో సోదరుడు మృతి

టాలీవుడ్ లో మరో విషాదం.. యువ హీరో సోదరుడు మృతి

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రీ చనిపోయిన విషయం తెలిసిందే.తాజాగా మరో విషాదం కూడా చోటు చేసుకుంది. యంగ్ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘రాజావారు రాణివారు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ఎస్‌ఆర్ కల్యాణమండపం మూవీతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు మృతి చెందారు. కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

బుధవారం ఉదయం కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు చనిపోయారు. కడప జిల్లా సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన కారులో ప్రయాణిస్తుండగా కడప జిల్లా చెన్నూరు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామాంజులు రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు.