అర్థరాత్రి యువకుని కిడ్నాప్

అర్థరాత్రి యువకుని కిడ్నాప్

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి కారులో ఎక్కించుకుని పోయారు. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గడ్డి అన్నారం డివిజన్ లోని పీ అండ్ టీ కాలనీలో బీజేపీ బహిష్కృత నేత లంకా లక్ష్మీ నారాయణ కుటుంబంతో నివాసముంటున్నాడు. ఆయన రెండో కుమారుడు లంకా సుబ్రహ్మణ్యం రాత్రి 12.45గంటల సమయంలో బయటకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న కొందరు యువకులు సుబ్రహ్మణ్యాన్ని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న సరూర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన యువకుని కోసం వెతుకుతున్నారు