Teja Sajja: నాదృష్టిలో యోధుడు అంటే పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న తేజ సజ్జ కామెంట్స్

Teja Sajja: నాదృష్టిలో యోధుడు అంటే పవన్ కళ్యాణ్.. వైరల్ అవుతున్న తేజ సజ్జ కామెంట్స్

హనుమాన్(HanuMan) సినిమాతో గ్లోబల్ వైడ్ గా భారీ విజయాన్ని అందుకున్నాడు టాలీవడ్ యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja). దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasghanth Varma) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక అప్పటినుండి తేజ సజ్జ చేయబోయే తరువాతి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తేజ సజ్జ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడు అని ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ప్రేక్షకుల ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. తన నెక్స్ట్  సినిమాను ప్రకటించాడు తేజ సజ్జ. 

ఈసారి పాన్ వరల్డ్ రేంజ్ లో మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. విజువల్ వండర్ గా వచ్చిన ఈ వీడియో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక వీడియో విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన హీరో తాజా సజ్జ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

మీడియా మీట్ లో భాగంగా మీరు కాకుండా సూపర్ యోధా అనే టైటిల్ మరో హీరోకి ఇవ్వాలంటే ఎవరికీ ఇస్తారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తేజ మాట్లాడుతూ..  నా దృష్టిలో ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ యోధుడు అంటే పవన్ కళ్యాణ్. ఆయన నటించిన ఓజి గ్లింప్స్ చూశాక.. సూపర్ యోధ అనే టైటిల్ అయితే ఆయనకీ బాగా సెట్ అవుతుంది అనిపించింది.  అది నా ఒపీనియన్.. అంటూ చెప్పుకొచ్చాడు తేజ సజ్జ. ప్రస్తుతం ఈ కుర్ర హీరో చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.