సిప్‌‌‌‌కు ఓకే అంటున్న యంగ్‌‌‌‌ ఇన్వెస్టర్లు

సిప్‌‌‌‌కు ఓకే అంటున్న యంగ్‌‌‌‌ ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: యంగ్ ఇండియన్స్ మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. ముఖ్యంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాన్ (సిప్‌‌‌‌) రూట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడానికి  ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఈజీగా సిప్ చేయడానికి వీలుండడం, ఫైనాన్షియల్ లిటరసీ పెరగడం, ఆదాయాలు కూడా మెరుగవ్వడంతో యువత సిప్‌‌‌‌లకు ప్రాధాన్యం ఇస్తోందని వైట్‌‌‌‌ఓక్‌‌‌‌  క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్‌‌‌‌ పంత్ పేర్కొన్నారు.

3.33 లక్షల మంది ఇన్వెస్టర్లకు చెందిన రూ. 8,400 కోట్లను మేనేజ్ చేస్తున్నామని అన్నారు.  వీరిలో 56 శాతం మంది జెన్‌‌‌‌ జెడ్‌‌‌‌ (1997–2012 మధ్య పుట్టినవారు), మిలీనియల్స్‌‌‌‌ (1981–1996 మధ్య పుట్టినవారు)  ఉన్నారని అన్నారు. 18–35 ఏళ్ల మధ్య ఉన్నవారు 28 శాతం మంది, 35–45 ఏళ్ల మధ్య ఉన్నవారు మరో 28 శాతం మంది ఉన్నారని వివరించారు. మెజార్టీ ఇన్వెస్టర్లు (51 శాతం మంది)  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని ప్రతీక్ వెల్లడించారు.

రిటర్న్స్ రీజనబుల్‌‌‌‌గా ఉండడం, తక్కువ అమౌంట్‌‌‌‌తో అయినా ఇన్వెస్ట్ చేయడానికి వీలుండడం, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌‌‌‌మెంట్ సర్వీస్‌‌‌‌లు, ఈజీగా విత్‌‌‌‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండడంతో యంగ్ ఇన్వెస్టర్లు సిప్‌‌‌‌ బాట పడుతున్నారని చెప్పారు.  మిలీనియల్స్‌‌‌‌తో పోలిస్తే 18–35 ఏళ్ల మధ్య ఉన్నవారు తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారని అన్నారు. తక్కువ అమౌంట్‌‌‌‌ను ఇన్వెస్ట్ చేస్తున్నా ఎక్కువ కాలం సిప్ కొనసాగిస్తే సంపద క్రియేట్ చేయొచ్చని ప్రతీక్ సలహా ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ 7.92 కోట్ల  సిప్ అకౌంట్లను మెయింటైన్ చేస్తున్నాయి.