
కొల్చారం, వెలుగు: భార్య కాపురానికి రాలేదని ఓ యువకుడు కరెంట్టవర్ ఎక్కాడు. ఈ సంఘటన శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన దేవి సింగ్ తన భార్య శిరీష కాపురానికి రావడం లేదని గత ఏడాది నవంబర్ లో పోలీస్ స్టేషన్ ముందున్న టవర్ ఎక్కాడు.
అయినా ఆమె తన మాట వినడం లేదని మరోమారు పోలీస్స్టేషన్ ముందున్న ఎలక్ట్రిక్ టవర్ ఎక్కడని కుటుంబీకులు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని పోలీసుల హామీ ఇవ్వడంతో దేవీసింగ్ టవర్ పై నుంచి దిగాడు. కాగా ఇదే విషయంలో గత నవంబర్ లో ఇక్కడే టవర్ ఎక్కాడు.