ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస గుండెపోటు మరణాలు గుబులు పుట్టిస్తోంది. ఇందులో ఎక్కువ మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఫోన్ మాట్లాడుతూ ఒ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. 

కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. యువకుని మృతితో కుటుంబంలో విషాదఛాయలనుకున్నాయి. గత ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు మృత్యువాత పడడటం భయాందోళనకు గురిచేస్తోంది.