మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో యువకుడి మృతి..బంధువుల ఆందోళన

మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో యువకుడి మృతి..బంధువుల ఆందోళన

నల్లగొండ: డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మిర్యాలగూడలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు మృతుడి తల్లిదండ్రులు, బంధువులు.వెంకటాద్రి పాలెంకు చెందిన శేఖర్ అనే యువకుడు మంగళవారం (మే 28) ఉరివేసుకొని ఆత్మహత్యా యత్నం చేయగా మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తీసు కొచ్చారు..చికిత్స పొందుతూ శేకర్ బుధువారం మృతిచెందాడు.

అయితే శేఖర్ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతుని బంధువులు ఆస్పత్రి ముందుకు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.