దారుణం.. ఇద్దరు చిన్నారులపై యువకుడి లైంగిక దాడి

దారుణం.. ఇద్దరు చిన్నారులపై యువకుడి లైంగిక దాడి

చిత్తూరు: జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బి. కొత్తకోట మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అనీల్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే చిన్నారులు భయంతో అరవడంతో.. స్థానికులు యువకుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. కొన్నిరోజులుగా కాలనీలో చిన్నారులను అనీల్ వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.