ఒరిజినల్ ఆధార్ చూపించలేదని.. బస్సులోంచి దించేశారు

ఒరిజినల్ ఆధార్ చూపించలేదని.. బస్సులోంచి దించేశారు

రాజన్న సిరిసిల్ల: మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగా ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం మనకు తెలుసు. ఆధార్ కార్డు చూపించి ఉచితంగా బస్సుల్లో ప్రయాణించొచ్చన్ని రాష్ట్ర ప్రభుత్వం, అటు టీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా అందుతున్న ఉచిత బస్సు ప్రయాణించేందుకు మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీ సీ బస్సులను వినియోగిస్తున్నారు. దీంతో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురౌతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా వేముల వాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఓ యువతి రూల్స్ పేరుతో తనను మధ్యలోనే దించేశారు కండక్టర్. దీంతో ఆ అమ్మాయి బంధువులు డిపోమేనేజర్ తో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. 

వేముల వాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన యువతిని మధ్యలోనే బస్సు నుంచి దించేశారు కండక్టర్.  ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించలేదని వేములవాడ నంది కమాన్ వద్ద దించేశారు. అయితే సెల్ లో ఆధార్ కార్డును చూపించినా వినలేదని.. ఒరిజినల్ కార్డు ఉంటే బస్సులో ఉచిత ప్రయాణం అని బస్సు నుంచి ఆ యువతిని దించేశారు. దీంతో స్టూడెంట్ అయిని ఆమెను ఊరిబయట ఎలా దించేస్తారు అంటూ డిపో మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు యువతి బంధువులు. రూల్స్ ప్రకారం ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించలేదని సమాధానం చెప్పారు డిపో మేనేజర్.