ఇంటర్ చదివి ఇంట్లో ఉంటున్న యువతి.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ప్రియుడు.. చివరకు ఏమైందంటే..

ఇంటర్ చదివి ఇంట్లో ఉంటున్న యువతి.. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ప్రియుడు.. చివరకు ఏమైందంటే..
  • కుటుంబీకులు గుర్తించడంతో యువతి సూసైడ్
  • కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం వైగాంలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: అర్ధరాత్రి ప్రియుడు ఇంటికి రాగా, ఈ విషయాన్ని కుటుంబీకులు గుర్తించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలం గుడ్లబోరి గ్రామపంచాయతీ పరిధిలోని వైగాం గ్రామానికి చెందిన ఉరుకుడే రావుజీ కూతురు అశ్విని (20) ఇంటర్  వరకు చదివి ఇంట్లో ఉంటోంది. ఈ నెల 17న రాత్రి పేరెంట్స్​ ఇంటి బయట పడుకోగా, కాగజ్ నగర్ మండలం అందెవెల్లికి చెందిన జాబరి ప్రవీణ్  ప్రియురాలు అశ్విని ఇంటికి వచ్చాడు.

అర్ధరాత్రి రావూజీ కొడుకు ఇంద్రదాస్ భజనకు వెళ్లి ఇంటికి రాగా, ప్రవీణ్ ఇంట్లో ఉండడం గమనించాడు. కుటుంబీకులు, చుట్టు పక్కల వాళ్లు ప్రవీణ్ ను నిలదీయగా, అశ్విని, తాను ప్రేమించుకుంటున్నామని అందుకే వచ్చానని చెప్పాడు. ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్​ చేసి విషయం చెప్పగా, ఉదయం వచ్చి తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. ప్రవీణ్ ను పక్క ఇంటికి తీసుకెళ్లగా, అశ్విని మనస్తాపంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు కాగ జ్ నగర్, అక్కడి నుంచి మంచిర్యాల హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అశ్విని చనిపోయింది.మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయ్  తెలిపారు.