ప్రియుడి ఇంటి ముందు  కత్తితో యువతి హల్ చల్

ప్రియుడి ఇంటి ముందు  కత్తితో యువతి హల్ చల్

నవాబుపేట, వెలుగు: మహబూబ్​నగర్​జిల్లా నవాబుపేట మండలం చౌటపల్లి గ్రామంలోని ప్రియుడి ఇంటి ముందు ఆదివారం ఓ యువతి కత్తితో హల్ చల్​చేసింది. గ్రామస్తులు, యువతి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​కు చెందిన పూజకు చౌటపల్లికి చెందిన శేఖర్ 2018లో ఫేస్​బుక్​లో తిలక్​అనే పేరుతో పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. పూజను పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేయడంతో 3 రోజుల కింద యువతి చౌటపల్లిలోని శేఖర్​ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. అప్పుడు ఇంట్లో శేఖర్,​ అతని కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పూజ వెళ్లిపోయింది. ఆదివారం బంధువులతో గ్రామానికి వచ్చిన పూజ.. తనకు న్యాయం చేయకపోతే కత్తితో పొడుచుకుని చచ్చిపోతానని, అడ్డొస్తే చంపుతానని బెదిరించింది. కత్తి లాక్కునేందుకు ప్రయత్నించిన శేఖర్ అన్న, అక్కపై పూజ కత్తితో దాడి చేసింది. ఇద్దరి చేతులకు  తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శేఖర్ ​బంధువులు యువతిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని  వారించగా చెట్టుకు ఉరేసుకుంటానని బెదిరించింది. పోలీసుల ఆమెను స్టేషన్​కు తరలించారు. కాగా శేఖర్ ఆర్మీ జవాన్ అని తెలిసింది.