బీ అలర్ట్.. స్పై వేర్‌‌‌‌ యాప్‌తో యువతులకు వేధింపులు

బీ అలర్ట్.. స్పై వేర్‌‌‌‌ యాప్‌తో యువతులకు వేధింపులు

హైదరాబాద్‌‌,వెలుగు: స్పై వేర్‌‌ యాప్​ యువతులను వెంటాడుతోంది. ‌‌ వ్యక్తిగత వివరాలను బయటపెట్టి  బ్లాక్‌‌ మెయిలింగ్‌‌ చేయిస్తోంది. బాధిత యువతులు ఫ్యామిలీకి చెప్పుకోలేక, పోలీసులకు కంప్లయింట్​ చేయలేక  తీవ్ర మానసిక వేదనకు లోనవు తున్నారు. ఒYoung women are being harassed with a mobile spyware appకవేళ వేధింపులు తీవ్రమై భరించలేని బాధితులే పోలీసులకు కంప్లయింట్ ​చేస్తుండగా బ్లాక్‌‌ మెయిలర్స్‌‌ను గుర్తిస్తున్నారు. నాలుగు కేసుల్లో తెలిసిన వాళ్లే బ్లాక్‌‌ మెయిలర్స్‌‌గా తేల్చారు. మొబైల్‌‌ ఫోన్‌‌లో స్పై వేర్ యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసి వేధించినట్లు ఆధారాలు సేకరించారు. సిటీలో స్పై వేర్ ​యాప్ ​వేధింపులు పెరిగిపోతుండగా సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్​చేశారు. 

యాప్ ​టైటిల్​ మార్చుతూ..

మొబైల్​ టెక్నాలజీలో భాగంగా ప్రతిరోజు ప్లే స్టోర్​లో కొత్త ‌‌యాప్స్‌‌ వచ్చి చేరుతుండగా, ఇందులో ఇల్లీగల్ యాప్స్‌‌ కూడా ఉంటున్నాయి. వాటిని సైబర్ క్రిమినల్స్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకొని హ్యాకింగ్‌‌ చేస్తున్నారు. స్పై యాప్‌‌ను గుర్తించకుండా టైటిల్‌‌ను మార్చుతున్నారు. యాప్ ఇన్‌‌స్టాలేషన్‌‌ తర్వాత ఆ ఫోన్‌‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో మొబైల్‌‌ యూజర్ యాక్టివిటిస్​ను  ట్రేస్‌‌ చేసి బ్లాక్​ మెయిలింగ్​కు పాల్పడుతున్నారు. 

ఎక్కువగా పర్సనల్ డేటాతోనే..

యాప్​ లింక్స్‌‌తో పాటు డైరెక్ట్‌‌గా మొబైల్స్ లో స్పై వేర్‌‌ యాప్​ ఇన్‌‌స్టాల్‌‌ చేస్తున్నారు. ఇలా చేసేవారిలో బంధువులు, ఫ్రెండ్స్‌‌, సహోద్యోగులు,  ప్రేమికులు ఉంటున్నారు. ఇలా తెలిసిన వారే స్పై వేర్‌‌ ‌‌యాప్​ ఇన్‌‌స్టాల్‌‌ చేసి మొబైల్‌‌ ఫోన్‌‌ను యాక్సెస్‌‌లోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత మొబైల్‌‌ యాక్సెస్‌‌ను తమ కంట్రోల్‌‌ కి తెచ్చుకుని ట్రాక్‌‌ చేస్తున్నారు. స్పై వేర్‌‌ ‌‌యాప్​తో ఫోన్‌‌ కాల్స్‌‌, వాట్సాప్‌‌ చాటింగ్స్‌‌, టెక్స్ట్‌‌మెసేజ్‌‌లు, బ్యాంక్‌‌ ఓటీపీలను హ్యాక్ చేసే వీలు ఉంది. అయితే ఎక్కువగా యువతుల పర్సనల్‌‌ డేటాతోనే బ్లాక్‌‌ మెయిలింగ్‌‌ చేస్తున్నారు.

తెలిసినవారే​ చేస్తుండగా..

స్పై వేర్‌‌‌‌ యాప్​ ఇన్‌‌స్టాల్‌‌ ఫోన్​లో అంత ఈజీ కాదు. యాప్స్‌‌ గురించి బాగా తెలిసిన వాళ్లే యూజ్ చేస్తారు. మొబైల్‌‌లో తెలియని యాప్స్‌‌ ఉంటే వెంటనే అన్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేయాలి. మేము ట్రేస్ చేసిన వాటిలో ఎక్కువగా తెలిసిన వారే స్పై వేర్​ఇన్‌‌స్టాల్ చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి కేసుల్లో చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.  వేధింపులు తీవ్రంగా ఉంటేనే  పోలీసులకు కంప్లయింట్​చేస్తున్నారు.  
-  తనీష్‌‌, ఎథికల్ హ్యాకర్‌‌‌‌, హైదరాబాద్‌‌

మొబైల్ ​ఇతరులకు ఇవ్వొద్దు 

మొబైల్ ఫోన్ ఇతరులకు ఇవ్వొద్దు. రెండు నిమిషాల్లో  స్పై వేర్ యాప్స్ డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేయొచ్చు. ఇలాంటి యాప్స్ తో ఇతరులు కూడా మన ఫోన్ ఆపరేట్ చేసే చాన్స్ ఉంది. చాలా మంది మహిళలు, యువతులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొం టున్నారు. కొంతమంది బయట కు చెప్పుకో లేక, పోలీసులకు కూడా కంప్లయింట్​ చేయడంలేదు.  అనుమానం వస్తే ఫోన్ ఫార్మేట్ చేసి కంపెనీ యాప్స్ తో రన్ చేసుకోవాలి.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్