వీరలేడీస్ : సెల్ఫీల కోసం కొట్టుకున్న మహిళలు.. సినిమా చూసినట్లు చూసిన జనం

వీరలేడీస్ : సెల్ఫీల కోసం కొట్టుకున్న మహిళలు.. సినిమా చూసినట్లు చూసిన జనం

ఈ మధ్యకాలంలో యువత ఫోన్ కు బాగా అడెక్ట్ అవుతున్నారు. ఫోన్ లో వీడియోలు, సెల్ఫీలు అంటే ఇంకా పిచ్చి పట్టినట్లు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా ఫోన్ తీసి సెల్ఫీ దిగడం, ఆ ఫోటోలను సోషన్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి కామన్ అయింది. అయితే ఇలాంటి సెల్ఫీలు కొన్నిసార్లు శృతిమించి అపశ్రుతికి దారితీసిన సందర్భాలు ఉన్నాయి. 

తాజాగా సెల్ఫీల విషయంలో కూడా గొడవలు జరిగి... ఘోరంగా కొట్టుకుంటున్నారు కొంతమంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదీ నిజం.. ఇలాంటి ఘటనే ఇప్పుడు గుంటూరులోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

సెల్ఫీల కోసం అమ్మాయిలు ఘోరంగా కొట్టుకున్నారు. ఆదివారం(నవంబర్ 26) సాయంత్రం సరదాగా గుంటూరులోని ఓ పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. ఓ చిన్న వివాదం కొట్టుకునే స్థాయికి వెళ్లింది. నగరంలో ఇటీవలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో జరిగిన వివాదంలో జుట్టు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. 

దీంతో పార్కులో ఉన్న జనాలంతా వారిని చూడటానికి అక్కడికి చేరుకున్నారు. వారు కొట్టుకొవడం చూసి కొందరు వారిని ఆపితే.. మరికొందరు సినిమా చూసినట్టు ఎంజాయ్ చేశారు. వారిని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం ఎవ్వరిని పట్టించుకోలేదు. ఈ అమ్మాయిల ఘర్షణను ఓ వ్యక్తి మొబైల్ రికార్డు చేసి.. సోషల్ మీడియాలో వీడియోని పెట్టాడు.. ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.